బంపర్ ఆఫర్ కొట్టేసిన కీర్తిసురేష్.. పాన్ ఇండియా మూవీలో ఛాన్స్

TV9 Telugu

16 March 2024

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది క్రేజీ బ్యూటీ కీర్తిసురేష్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఆతర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

దాంతో ఈ చిన్నదానికి బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించింది కీర్తి.

అలాగే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది కీర్తిసురేష్.

లేడీ ఓరియేంటేడ్ సినిమాల్లోనూ నటించింది ఈ చిన్నది కానీ.. కీర్తి నటించిన ఆ సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇక తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. కెరీర్ స్టార్టింగ్ లో స్కిన్ షోకు నో చెప్పిన ఈ భామ ఇప్పుడు అందాలతో ఆకట్టుకుంటుంది.

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో తన గ్లామర్ తో కేక పెట్టించింది కీర్తిసురేష్. ఇక ఇప్పుడు మరో భారీ ఆఫర్ అందుకుంది ఈ భామ.

దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కీర్తి ఇప్పుడు అల్లు అర్జున్ సరసన ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది.

అట్లీ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్.