అప్పటికి కల్కి వాయిదా.?

TV9 Telugu

05 April 2024

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఇండియన్ ఎపిక్ సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం కల్కి 2898 ఏడీ.

ఈ చిత్రంతో దీపికా పదుకొనె కథానాయకిగా తొలిసారి టాలీవుడ్ సినిమాలో కనిపించనుంది. దిశా పటాని కీలక పాత్రలో నటిస్తుంది.

విష్ణు పురాణం, భాగవత పురాణం, కల్కి పురాణం వంటి భారతీయ ఇతిహాసాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

ఎన్నికల కారణంగా ఈ చిత్రం వాయిదా పడనుందని వార్తలు గత కొన్నిరోజులు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

కల్కి 2898 ఏడి విడుదల తేదీలో మార్పు గురించి ఈ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు.

ప్రస్తుతానికి మే 9 ప్రకారమే బ్యాలన్స్ షూటింగ్‌తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు.

అయితే ఎన్నికల కారణంగా సినిమా పోస్ట్ పోన్ కావడం దాదాపు ఖాయమైపోయిందన్నది సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం సినిమా ఎన్నికల హడావిడి అంత అయినా తర్వాత జూన్‌లో విడుదల కానుందని తెలుస్తుంది.