తారక్ పేరు మారనుందా.! ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR.!
Anil Kumar
16 August 2024
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టింది మొదలు.. ఎన్టీఆర్‌ను జూనియర్ ఎన్టీఆర్ అనే అంటున్నాం.!
విశ్వ విఖ్యాత పెద్ద ఎన్టీఆర్‌కు జూనియార్ వర్షన్‌గా ఫీలవుతున్నాం తారక్ ని.! అయితే ఇప్పుడీ పేరే మారిపోయింది.
ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాదు.. మిస్టర్ ఎన్టీఆర్‌గా మారిపోయింది. ఎందుకు.. ఏంటి.. అనుకుంటున్నారా.?
దీనికి సంబంధించి రీసెంట్‌గా ఎన్టీఆర్ టీం రిలీజ్ చేసిన నోట్ నే కారణం అయ్యింది. దీనిపై ఆరా తీస్తున్నారు.
ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగినట్టు వైరల్ అయిన న్యూస్ పై క్లారిటీ ఇస్తూ తారక్ టీం ఓ నోట్ రిలీజ్ చేసింది.!
అయితే ఈ నోట్‌లో.. జూనియర్ ఎన్టీఆర్ కి బదులుగా.. మిస్టర్ ఎన్టీఆర్ అంటూ కోట్ చెయ్యడం గమనిస్తున్నారు..
ఇప్పటికీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు కానీ.. నెట్టింట మాత్రం విపరీతంగా వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.
ఇదిలా ఉంటె తాజాగా ఎన్టీఆర్ దేవర మూవీ నుండి విడుదల అయినా చుట్టమల్లే సాంగ్ యూ ట్యూబ్ ని షేక్ చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి