TV9 Telugu
బన్నీతో మళ్లీ సమంత?
06 March 2024
బన్నీతో సమంత మళ్లీ జోడీ కడతారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వీరిద్దరూ కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశారు.
ఆ తర్వాత పుష్ప 1 ది రైజ్ సినిమాలో ఉ అంటావా మావా ఉఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ కు కలిసి స్టెప్పులేశారు.
ఇప్పుడు తెరకెక్కుతున్న పుష్ప2 ది రూల్ సినిమాలోనూ సమంతతో స్పెషల్ సాంగ్ ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బన్నీ గురించి గొప్పగా చెప్పారు సమంత. ఈ మధ్య ఓ కాలేజీ ఫంక్షన్‌లో పాల్గొన్నారు సమంత రూత్ ప్రభు.
యాక్టింగ్‌లో మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది సామ్‌కి. ఏమాత్రం తడుముకోకుండా ఐకాన్ స్టార్ పేరు చెప్పేశారు సమంత.
యాక్టింగ్ బీస్ట్ గా ఆయన ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరు తనకు ఇన్‌స్పిరేషన్ అని అన్నారు స్టార్ హీరోయిన్ సమంత.
ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చాల ఇంటర్వ్యూల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పొగిడారు హీరోయిన్ సమంత.
ఆయన తన సూపర్ హీరో అని అన్నారు. శాకుంతలంలో సమంతతో అల్లు అర్హ నటించిన విషయాన్ని కూడా గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి