అడ్రస్ లేకుండా మాయమైన అందాల భామ.. ప్రీతీ పాప ఎక్కడబ్బా..!!

01 December 2025

Pic credit - Instagram

Rajeev 

షాలిని పాండే  తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది

జబల్‌పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన షాలిని, చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది.

షాలిని పాండే 2017లో విజయ్ దేవరకొండ నటించిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది

ఈ చిత్రంలో ఆమె ప్రీతి అనే పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అలాగే తన అందంతో మెప్పించింది.

తెలుగు మాట్లాడడం రానప్పటికీ, ఈ చిత్రంలో తన పాత్రకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.  

  అర్జున్ రెడ్డి తర్వాత షాలిని తెలుగులో మహానటి, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షాలిని. రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.