వైజయంతీ మూవీస్‌కి మే 9 ఎందుకంత స్పెషల్..

TV9 Telugu

08 June 2024

అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కి మే 9 మరిచిపోలేని రోజు. సి.అశ్వినీదత్  కొన్ని చిత్రాలను నిర్మించి ఈ రోజే విడుదల చేశారు.

వైజయంతి మూవీస్ నిర్మాణంలో మే 9న విదులైన నాలుగు సినిమాల్లో 3 సినిమాలు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

1990 మే 9న విడుదలైన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చరిత్ర సృష్టించింది. దీన్ని వైజయంతి మూవీ నిర్మించింది.

2018 మే 9న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి నిర్మాణంలో వచ్చిన మహానటి కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

2019 మే 9న వంశి పైడిపల్లి, మహేష్ బాబు కాంబోలో మహర్షి సినిమాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించింది. ఇది కూడా బ్లాక్ బస్టర్.

అందుకే ప్రభాస్ హీరోగా చేస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD కూడా మే 9న విడదల చేయాలనుకున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగాతో పాటు మరికొన్ని కారణాల వల్ల కల్కి సినిమా జూన్ 27కి వాయిదా పడింది.

అయితే ఇదే బ్యానర్ లో వచ్చిన 2003 మే 9న కంత్రి డిజాస్టర్ అయినప్పటికీ ఇందులో ఎన్టీఆర్ 3D యానిమేటెడ్ పాత్రకి ప్రశంసలు అందుకుంది.