ఇప్పుడు ఎప్పుడన్నా... ఏ ఒక్కరో, ఇద్దరో తెలుగు హీరోయిన్లు కనిపిస్తే 'మన తెలుగమ్మాయిలు' అంటూ ఇష్టంగా చెప్పుకునే కల్చర్ వచ్చింది.
అయితే ఒకప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది తెలుగు హీరోయిన్లే ఉండేవారు. స్టార్ హీరోల చిత్రాల్లో నటించి సూపర్ అనిపించుకునేవారు.
వారిలో ఒకరే లేడీ అమితాబ్ బచ్చన్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి. ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసింది లేడీ కెప్టెన్ విజయ నిర్మల.
ఈ విషయాన్ని టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి మరోసారి సోషల్ మీడియా వేదికగా సినీ అభిమానులకు చెప్పారు.
''నన్ను కళాకారిణిగా విశ్వసించి, కృష్ణగారితో హీరోయిన్‌గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి, నాకు తరగని గెలుపు, ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మలగారూ..''
ఈ విధంగా విజయనిర్మల గురించి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసి మరీ గుర్తుచేసుకున్నారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.
హీరోయిన్, డైరక్టర్ విజయనిర్మల జయంతి సందర్భంగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు లేడీ అమితాబ్ విజయశాంతి.
తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలకి జోడిగా నటించారు ఈమె. 2020లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్ర పోషించారు.