TV9 Telugu
28 January 2024
తెలుగులో చిరు కంటే ముందు పద్మ విభూషణుడు ఎవరు..?
చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కెరీర్‌లో మరో కలికితురాయి చేరింది..
పద్మ భూషణ్ మాదిరే విభూషణ్‌ను కూడా పండగలా జరపబోతున్నారా..?
మెగాస్టార్ చిరంజీవి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. తాజాగా పద్మ విభూషణ్ కూడా తోడైంది.
భారతదేశపు రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా..
చిరంజీవికి ప్రకటించడంతో ఆయన అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రజలు పండగ చేసుకుంటున్నారు.
చిరంజీవి కంటే ముందు తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావుకి మాత్రమే ఈ గౌరవం దక్కింది.
2011లో ANRకి పద్మ విభూషణ్ ఇచ్చారు. సౌత్ ఇండస్ట్రీలో 2016లో రజనీకాంత్ మాత్రమే ఈ బిరుదు అందుకున్నారు.
ఇక 2006లోనే పద్మ భూషణ్ అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు విభూషణ్ కూడా తోడైంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి