TV9 Telugu
తమన్నా ఫ్రెండ్స్ ఎవరు?
06 March 2024
స్టార్ కథానాయక తమన్నా భాటియా ఫ్రెండ్స్ లిస్టులో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లో ఉండే పేరు హీరోయిన్ శ్రుతి హాసన్.
వీరిద్దరికి ఇండస్ట్రీలో ఎలా పరిచయమైందో తెలీదుగానీ.. ఇద్దరు బ్యూటీలు ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.
అంతకుమించి మిల్కీ బ్యూటీ తమన్నాకు క్లోజ్ ఫ్రెండ్స్ లిస్టులో హీరోయిన్లెవరూ ఎప్పుడూ కనిపించలేదనే చెప్పాలి.
కానీ, తమన్నాకు, కాజల్ అగర్వాల్‌కీ ఉన్న ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు బయటపడింది. తమన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 19 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ఫ్యాన్ మేడ్ క్లిప్ షేర్ చేశారు కాజల్ అగర్వాల్. దాన్ని చూసిన తమన్నా ఎగ్జయిట్ అయ్యారు.
ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో తనకు సపోర్ట్ చేసినందుకు కాజల్ అగర్వాల్‌కి థాంక్స్ చెప్పారు మిల్కీ బ్యూటీ తమన్నా.
థాంక్యూ కాజూ అంటూ కాజల్ పోస్ట్ కి తమన్నా భాటియా స్పందించిన తీరుకు ఫిదా అవుతున్నారు ఇద్దరి అభిమానులు.
భవిష్యత్తులో మరిన్ని గుర్తుండిపోయే సినిమాల్లో నటిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు మిల్కీ బ్యూటీ తమన్నా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి