సెట్స్‌పై ఓ సినిమా.. మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకులు..

13 November 2023

ఓ పెద్ద సినిమా చేస్తున్నపుడు దర్శకుల ఫోకస్ అంతా దానిపైనే ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ లేట్ అవుతున్నపుడు మరో ఆప్షన్ చూసుకుంటున్నారు దర్శకులు.

ఈ క్రమంలోనే ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమా చేస్తున్నారు. తాజాగా గౌతమ్ తిన్ననూరి కూడా ఇదే చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ సినిమా సెట్స్‌పై ఉండగానే... మరో సినిమాను మొదలుపెట్టారు యంగ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.

పొన్నియన్ సెల్వన్‌లో చిన్నప్పటి ఐశ్వర్యా రాయ్ పాత్రలో నటించిన సారా అర్జున్ కీలక పాత్రలో ఓటిటి కోసం ఓ హై స్కూల్ రొమాన్స్ డ్రామా తెరకెక్కిస్తున్నారు గౌతమ్.

ఆ మధ్య మారుతి కూడా పక్కా కమర్షియల్ చేస్తూ.. కరోనా టైమ్‌లో మంచి రోజులు వచ్చాయి తెరకెక్కించారు మారుతి.

క్రిష్ కూడా ఇదే ఫార్ములా అప్లై చేసారు. హరిహర వీరమల్లుకు పవన్ డేట్స్ ఇవ్వనపుడు.. కేవలం 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలం తెరకెక్కించారు.

రవితేజతో రావణాసుర సినిమా చేస్తున్నపుడే.. రెజీనా, నివేదా థామస్‌తో శాకిని ఢాకిని సినిమా తెరకెక్కించారు సుధీర్ వర్మ.

ఇలా ఒక పెద్ద సినిమా చేస్తూనే.. మధ్యలో గ్యాప్ దొరికినపుడు మరో సినిమా చేస్తున్నారు మన టాలీవుడ్ దర్శకులు.