శౌర్యాంగపర్వం సెట్స్ కి డార్లింగ్ వెళ్లేదెప్పుడు?
TV9 Telugu
13 March 2024
పాన్ ఇండియా స్టార్ హీరో రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి రోజుకో వార్త న్యూస్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది.
ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన సలార్ పార్ట్ 2 శౌర్యాంగపర్వం సెట్స్ లో ఎప్పుడు జాయిన్ అవుతారనే సంగతి వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సలార్ పార్ట్ 2 శౌర్యాంగపర్వం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఏప్రిల్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆల్రెడీ చెప్పారు బ్లాక్ బస్టర్ సలార్ సినిమా ప్రొడ్యూసర్.
దీన్ని బట్టి, ఫస్ట్ షెడ్యూల్ వచ్చే నెలాఖరు నుంచి శౌర్యాంగపర్వం మూవీ షూటింగ్ మొదలవుతుందని అనుకోవచ్చు.
ఫస్ట్ షెడ్యూల్‌లో పృథ్విరాజ్ సుకుమారన్ మీద కీలక సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్.
ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్‌లో బాబీ సింహా, శ్రియా రెడ్డి, జగపతిబాబు మీద ఓ స్పెషల్ ఎపిసోడ్ చిత్రీకరిస్తారు.
ఈ సినిమా మూడో ఎపిసోడ్ తెరకెక్కించే సమయానికి ప్రభాస్ సెట్స్ లో జాయిన్ అవుతారన్నది ఇప్పటికున్న న్యూస్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి