ఈ టాలీవుడ్ కొత్త ముద్దుగుమ్మలు పుట్టినరోజులు ఎప్పుడంటే.?

26 January 2025

Prudvi Battula 

ఇటీవల ప్రభాస్‎కి జోడిగా హను చిత్రంలో కథానాయకిగా ఛాన్స్ కొట్టిసిన ఇమాన్ ఇస్మాయిల్ 20 అక్టోబర్ 1995న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది.

రవితేజ సరసన మిస్టర్ బచ్చన్‎లో హీరోయిన్‎గా నటించిన భాగ్యశ్రీ బోర్సే 6 మే 1999న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‎లో పుట్టింది.

గత ఏడాది ఆయ్, క సినిమాల్లో కథానాయకిగా సందడి చేసిన నయన్ సారిక 24 ఆగస్టు 2001న హైదరాబాద్‎లో జన్మించింది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో కుర్రకారు మనసు దోచేసిన శివాని నాగరం 22 ఆగస్టు 2001న హైదరాబాద్‎లో జన్మించిన తెలుగమ్మాయి.

బాబుల్ గమ్ సినిమాతో కథానాయకిగా తెలుగులో పరిచయం అయినా మానస చౌదరి 2 ఆగస్టు 2000న చెన్నైలో జన్మించింది.

మ్యాడ్ సినిమాలో ఓ కథానాయకిగా కుర్రాళ్ల మనసు దోచేసిన అనంతిక సనీల్‌కుమార్ 2 ఫిబ్రవరి 2006న కేరళలో జన్మించింది.

మ్యాడ్ మూవీలో మరో కథానాయకిగా ఆకట్టుకున్న గోపికా ఉదయన్ 13 అక్టోబర్ 1999న జన్మించింది. ఈమె కేరళకు చెందిన నటి.

మ్యాడ్ చిత్రంలో కథానాయకిగా కనిపించిన శ్రీగౌరి ప్రియా రెడ్డి 13 నవంబర్ 1998న జన్మించిన ఈమె హైదరాబాద్‎కి చెందిన తెలుగమ్మాయి.