ఎలక్షన్‌కీ, ఇస్మార్ట్ కి లింకేంటి?
TV9 Telugu
24 March 2024
ఎలక్షన్స్ కీ, డబుల్ ఇస్మార్ట్ రిలీజ్‌కీ లింకేంటి? 'ఉంది... లింకు ఉంది' అని అంటున్నారు హీరో రామ్ పోతినేని.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా డబుల్ ఇస్మార్ట్.
ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా మార్చి 8న విడుదల కావాల్సింది.
కానీ రిలీజ్ డేట్ చెప్పకుండా వాయిదా వేసింది టీమ్. ఈ సినిమా లేటెస్ట్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడారు రామ్ పోతినేని.
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో డబల్ ఇస్మార్ట్ రిలీజ్ వాయిదా పడింది అన్నారు రామ్.
ఈ ఏడాది జూన్‌లో ఈ యాక్షన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.
అప్పటికి ఎన్నికల హడావిడి మొత్తం పూర్తవుతుందని చెప్పారు. ప్రేక్షకులకు కూడా సినిమాల మీద ఇంట్రస్ట్ పెరుగుతుందని అన్నారు.
చాన్నాళ్లుగా పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు రామ్ పోతినేని. ఈ సినిమా హిట్ పూరి జగన్నాథ్ కి కూడా కీలకం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి