సినిమాలకు U, U/A, A, S సర్టిఫికేట్ల మధ్య తేడా ఏంటి?

TV9 Telugu

26 May 2024

ఏ సినిమా ఎవరు చూడాలని..? కొన్నింటికి పిల్లలు దూరంగా ఉండాలి.. మరికొన్నిటికి పెద్దలు దూరంగా ఉండాలి. వాటిని సెన్సార్ నిర్ణయిస్తుంది.

భారతదేశంలోని ఏ సినిమా అయినా ప్రదర్శించడానికి ముందు CBFC నుండి సర్టిఫికేట్ పొందాలి. లేదంటే ప్రదర్శించకూడదు.

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) జారీ చేస్తుంది.

సదరు సినిమాకు సంబంధించిన వ్యక్తులు సర్టిఫికేట్ కోసం సీబీఎఫ్‌సీ ప్రాంతీయ కార్యాలయాల్లో దరఖాస్తు చేస్తే.. వారు ఆ సినిమాను వీక్షించి.. అందుకు తగిన సర్టిఫికెట్ ఇస్తారు.

ఒక సినిమాకి 'U/A' సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే, అంటే పిల్లలు కూడా సినిమా చూడొచ్చని అర్థం. 12 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి మాత్రమే సినిమాను చూడవచ్చు.

ఎదైనా చిత్రానికి సెన్సార్ నుంచి 'U' సర్టిఫికేట్ లభించిందంటే, అన్ని వయసుల వారు ఆ సినిమాను చూడొచ్చని అర్థం.

'A' సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఇవి ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, నగ్నత్వం, అనుచిత భాష అన్నీ ఉంటాయి.

'S' సర్టిఫికేట్ సినిమాలు ప్రత్యేక ప్రేక్షకుల కోసం మాత్రమే. ఈ సినిమాలు వైద్యులు లేదా శాస్త్రవేత్తల వంటి వారి కోసం తీస్తారు.