నటిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది సమంత. తాజాగా సీటాడెల్ పార్ట్ 2కు సిద్ధమవుతున్న అమెజాన్ ప్రైమ్ కు షాక్ ఇచ్చింది.
సిటాడెల్ పై ఇంట్రెస్ట్ లేదని సీజన్ 2లో నటించనని తేల్చేసిందట. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా సిటాడెల్ లో నటించిన అందుకు తగిన ప్రతిఫలం దక్కకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సామ్ తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తదితర స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది.
దాదాపు పదేళ్లపాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన ఆమె.. ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాప్ ల దెబ్బకు డౌన్ అయింది. 2013లో తనకు డయాబెటిస్ ఉన్నట్లు ప్రకటించిన సమంత వర్కౌట్స్, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ దాని నుంచి బయటపడింది.
2022లో తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు ప్రకటించిన సామ్.. పూర్తిగా నార్మల్ అయ్యేందుకు కొన్నేళ్లు పట్టొచ్చని చెప్పింది.
సమంతకు ఓ నిక్ నేమ్ కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సామ్ పేరెంట్స్, ఫ్రెండ్స్ ఆమెను ముద్దుగా యశోదా అని పిలుస్తారు.
యశోద పేరుతో సామ్ ఒక సినిమా కూడా చేయడం విశేషం. ఇదిలా ఉంటే సమంత ప్రత్యూష పేరుతో ఓ ఎన్జీఓను నడుపుతోంది. దాని ద్వారా మహిళలు, పిల్లలకు అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తోంది.