29 August 2023

ఒక్కసారిగా మారుమోగిన పేరు.. ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదా.?

సంయుక్త మీనన్‌.. కొన్ని రోజుల కిందటి వరకు ఇండస్ట్రీలో బాగా గట్టిగా వినిపించిన పేరు ఇది. వరస సినిమాల్లో కనిపించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ అందాల సుందరి సంయుక్త..

అడుగు పెట్టిన ప్రతీ సినిమా బాగానే ఆడింది. హిట్స్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది టాలెంట్‌ ఉంది.. గ్లామర్‌ షో చేస్తుంది.

అయినా.. కూడా సంయుక్త మీనన్‌కు ఎందుకు ఆఫర్స్‌ తాగిపోయాయి , రావడం లేదనేది చాలామందికి అర్థం కాని ప్రశ్నే.

వరుస హిట్స్‌ ఇచ్చినా ఈమెకు కోరుకున్న ఛాన్సులైతే రావట్లేదు. కళ్యాణ్ రామ్ డెవిల్‌ కూడా ఎప్పుడో సైన్‌ చేసిన సినిమా.

కథల విషయంలో ఎలాంటి మొహమాటాల్లేకుండా నచ్చిన వాటికి మాత్రమే ఓకే చెప్తున్నారు సంయుక్త.

అందుకే సంయుక్త మీనన్‌ కు అవకాశాలు కాస్త ఆలస్యమవుతున్నాయని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో.

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫొటోస్ కు , గ్లామర్ షో కు మాత్రం అభిమానులు గట్టిగానే ఉన్నారు.