అజిత్‌కి విజయ్‌ ఫోన్‌... ఏం మాట్లాడుకున్నట్టు?

TV9 Telugu

13 March 2024

సోషల్‌ మీడియాను జాగ్రత్తగా గమనించేవారికి ఎవరికైనా, అజిత్‌ - విజయ్‌ ఫ్యాన్స్ మధ్య వార్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.

ఈ ఇద్దరు కోలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు ఒకరినొకరు ఏ స్థాయిలో విమర్శించుకుంటారో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.

అలాంటిది, ఆ రెండు వర్గాలను కలిపే న్యూస్‌ ఒకటి తమిళనాడు రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతోంది.

ఇటీవల స్టార్ హీరో అజిత్‌ కుమార్ కి ఫోన్‌ చేశారట కోలీవుడ్ స్టార్ విజయ్‌ దళపతి. ఆయన హెల్త్ గురించి పరామర్శించారట.

మెదడుకు వెళ్లే ఓ నరానికి (చెవి వెనుక వైపు ) వాపు రావడంతో హాస్పిటల్‌లో చేరి చికిత్స చేయించుకున్నారు అజిత్‌.

ఈ నేపథ్యంలోనే ఆయనకు ఫోన్‌ చేసి పరామర్శించారు విజయ్‌. అయితే వీరిద్దరి మధ్య రాజకీయాలకు సంబంధించిన మాటలేవీ రాలేదన్నది గమనార్హం.

త్వరలోనే తన తర్వాతి సినిమా విడాముయర్చి షూటింగ్ షెడ్యూల్‌ కోసం అజర్‌బైజాన్‌కి వెళ్లాల్సి ఉంది అజిత్‌.

తమిళ సైన్స్ ఫిక్షన్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో పార్టిసిపేట్‌ చేయాలి విజయ్‌ దళపతి.