వరలక్ష్మీ పెళ్లి వార్తపై ఆ హీరో ఏమన్నారంటే..

TV9 Telugu

17 April 2024

తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు స్టార్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ అంటే తెలియని తెలుగువారుంటారు.

తెలుగులో రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మగా తన నట విశ్వరూపం చూపించింది. తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

తర్వాత నాంది, యశోద, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి వంటి తెలుగు చిత్రాలతో హిట్స్ అందుకుంది వరలక్ష్మి శరత్‌కుమార్‌.

నెగటివ్ రోల్ చేసిన, పాజిటివ్ పాత్ర చేసిన దానిలో ఒదిగిపోవడం ఈమె ప్రత్యేకత. ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ తో బ్లాక్ అందుకుంది.

తాజాగా ఈమెకు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్టు తెలిపింది. తాజా దీనిపై రియాక్ట్ అయ్యారు తమిళ హీరో విశాల్.

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి వార్త తనకు ఆనందాన్ని కలిగించిందని అన్నారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌.

వృత్తిపరంగానూ స్టార్ నటిగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అనుకున్న స్థాయికి చేరుకున్నారని చెప్పారు హీరో విశాల్.

తెలుగు సినిమాల్లో మంచి స్థానంలో ఉండాలన్నది ఆమె లక్ష్యమని, అది నెరవేరినందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పారు విశాల్‌.