అనుపమ పరదా సంగతేంటి?

TV9 Telugu

16 March 2024

టాలీవుడ్ లో బబ్లీ యాక్ట్రెస్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ట్రెండ్‌ అవుతున్నారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌.

ఇటీవల తమిళంలో మారి సెల్వరాజ్‌ డైరక్షన్‌లో ఓ సినిమా చేయడం కోసం సైన్‌ చేశారు కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.

కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు మూవీని. దీంతో పాటు ఆమె నటిస్తున్న కొత్త తెలుగు సినిమా గురించి కూడా వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

సినిమా బండి ఫేమ్‌ ప్రవీణ్‌ కాండ్రేగులతో ఓ సినిమా చేసిందేకు సంతకం చేశారు క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌.

ఈ సినిమాకు పరదా అనే టైటిల్‌ని ఖరారు చేశారట. పరదా వెనుక సంగతులేంటన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే అంటోంది యూనిట్‌.

అనుపమ కథానాయకిగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ టిల్లు స్క్వయర్‌ కూడా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటిదాకా విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌ని చూసిన వారందరూ వారెవా అనుపమ... సరికొత్తగా కనిపిస్తున్నారంటూ మెచ్చుకుంటున్నారు.