సెప్టెంబర్ చివరి వారం ఓటిటిలో రానున్న వెబ్ ‎సిరీస్‎లు ఇవే.. 

24 September 2024

Battula Prudvi 

సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా కాలేజ్, డ్రామా ఇంగ్లీష్ వెబ్ ‎సిరీస్ 'డియర్ సా-చాన్' ప్రసారం అవుతుంది.

సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‎లో ప్రసారం కానున్న మరో వెబ్ సిరీస్ 'ఎల్లెన్ డిజెనెరెస్: ఫర్ యువర్ అప్రూవల్'.

రొమాన్స్, కామెడీ వెబ్ సిరీస్ 'స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2' అమెజాన్ ప్రైమ్ వీడియో, MX ప్లేయర్ యాప్స్‎లో సెప్టెంబర్ 25న స్ట్రీమింగ్ కానుంది.

సెప్టెంబర్ 25 నుంచి 'ఉయి వర్ కింగ్స్' అనే రొమాన్స్, డ్రామా సిరీస్ నెట్‌ఫ్లిక్స్‎లో ప్రసారం కానుంది.

సెప్టెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‎లో మరో వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. అదే బయోపిక్, డాక్యుసీరీస్ 'మిస్టర్ మెక్‌మాన్'.

'నో బాడీ వాంట్ దిస్' అనే రొమాంటిక్, కామెడీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదిక రిలీజ్ కానుంది.

'తాజా ఖబర్ సీజన్ 2' అనే ఫాంటసీ, థ్రిల్లర్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి హాట్‌స్టార్ యాప్‎లో స్ట్రీమింగ్ కానుంది.

సెప్టెంబర్ 27 నుంచి కొరియన్ హర్రర్ సిరీస్ 'జియోంగ్‌సోంగ్ క్రియేచర్ సీజన్ 2' నెట్‌ఫ్లిక్స్ వేదిక ప్రసారం కానుంది.

కామెడీ ఇంగ్లీష్ యానిమేటెడ్ సిరీస్ 'ది సింప్సన్స్ సీజన్ 36' సెప్టెంబర్ 30 నుంచి హాట్‌స్టార్‎లో ప్రసారం కానుంది.