11 December 2023

వరదల్లో మునిగిన సూపర్ స్టార్ హౌస్‌

మిచౌంగ్‌ తుఫాను ధాటికి చెన్నై అతలాకుతలం అయింది. 

చెన్నై మహా నగరంలో ఎక్కడ చూసినా వరద బీభత్సం కనిపిస్తోంది. 

సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా వరదల ధాటికి రోడ్డు మీదికి వస్తున్న పరిస్థితి. 

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇల్లు కూడా... వరదల్లో చిక్కుకుంది. 

ఇందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చెన్నైలోని దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దాంతో పాటే నగరం ఇలా అయిందనే షాక్ కలుగుతోంది.

ఇక ప్రస్తుతం రజినీకాంత్ టీజే జ్ఙానవేల్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.