లవ్ గురు చూడండి.. మరోసారి ప్రేమలో పడండి

TV9 Telugu

20 April 2024

విజయ్ ఆంటోనీ  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లవ్ గురు.మొదటి సారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్‌ముందుకొచ్చారు విజయ్.

విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ లో వచ్చిన లవ్ గురు సినిమాలో మృణాళిని రవి  హీరోయిన్ గా నటించింది

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా "లవ్ గురు" సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదలైందన్న విషయం తెలిసిందే.

లవ్ గురు సినిమా యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చింది.  ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ కొత్త లుక్ లో కనిపించారనే చెప్పాలి.

ఈ సినిమాలో మృణాళిని రవి క్యారెక్టర్ చూస్తే పెళ్లాం అంటే ఇలా ఉండకూడదురా బాబు అనేలా ఉంటుంది. సినిమాలో విజయ్ ఆంటోనీ పాత్ర చాలా బాగా పండింది.

మనిషిని కాదు మనిషి వ్యక్తిత్వాన్ని ప్రేమించాలని చెప్పే మంచి సందేశమున్న సినిమా ఇది. మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు.

తెలుగులో మాత్రం ఆహా ఓటీటీ, త‌మిళంలో అమెజాన్ ప్రైమ్‌లో మే 3న ఈ మూవీ రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.