ది ఢిల్లీ ఫైల్స్ గురించి వివేక్..
TV9 Telugu
24 April 2024
ది ఢిల్లీ ఫైల్స్ అనే సినిమాని ఈ ఏడాదే మొదలుపెట్టనున్నట్టు తెలిపారు ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.
ఈ సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. కంటెంట్‌ని నమ్ముకుని సినిమా చేస్తున్నట్టు తెలిపారు.
గత కొన్నేళ్లుగా తాను చెప్పదలచుకున్న కథలను ఇప్పుడు చెబుతుండటం ఆనందంగా ఉందని అన్నారు వివేక్ అగ్నిహోత్రి.
2005లో మొదలుపెట్టిన వివేక్ అగ్నిహోత్రి చాక్లెట్, ధన్ ధనా ధన్ గోల్, హేట్ స్టోరీ, జిడ్, బుద్ధ ఇన్ ది ట్రాఫిక్, జునూనియాత్ చిత్రాలు చేసారు.
2019లో వచ్చిన తాష్కెంట్ ఫైల్స్ నుంచి కొత్త ప్రయాణం మొదలుపెట్టారు ఈయన. జనాలకు తెలియని నిజాలను తన సినిమాలతో బయటపెడుతున్నారు.
అలంటి సినిమానే ది కాశ్మీర్ ఫైల్స్ కూడా. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా పలు విమర్శలు వచ్చిన బ్లక్ బస్టర్ అయింది.
ఈ చిత్రం కాశ్మీర్ లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది.
2023లో కాశ్మీర్ ఫైల్స్: అన్ రిపోర్టెడ్, ది వాక్సిన్ వార్ చిత్రాలతో ప్రేక్షకుల ముందు వచ్చారు. ఇప్పుడు ది ఢిల్లీ ఫైల్స్ తో రానున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి