విశ్వంభర యాక్షన్ షురూ.. విజయ్ చివరి సినిమా..

TV9 Telugu

05 April 2024

మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్ జంటగా నటిస్తున్న సోసియో ఫాంటసీ విశ్వంభర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు కొంత మంది ఫైటర్లతో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు వశిష్ట.

ప్రముఖ టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో కీలక యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ యాక్షన్ సీక్వెన్స్ స్పెషల్ హైలైట్ కానుందని నిర్మాతలు తెలిపారు. దీనికోసం భారీగా ఖర్చు పెడుతున్నారు.

విజయ్ దళపతి రాజకీయాల్లోకి వెళ్తుండటంతో.. ఈయన చివరి సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు.

దీనికి దర్శకుడు ఎవరు అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. సోషల్ మీడియా దీనిపై ప్రతిరోజు బాగా చర్చ జరుగుతుంది.

తెలుగు, తమిళంలో కొందరు దర్శకుల పేర్లు వినిపించాయి కానీ చివరికి హెచ్ వినోద్ పేరు బలంగా వినిపిస్తుంది.

ఖాకీ, వలిమై, తునివు వంటి తమిళ్ సినిమాలతో ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలోనే విజయ్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.