డబుల్ స్పీడ్‌లో విశ్వంభర.. ఆ దర్శకులతో విజయ్..

TV9 Telugu

02 April 2024

చిరంజీవి, త్రిష జంటగా వశిష్ట తెరకెక్కిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రం విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ఇప్పటికే ఈ చిత్ర ఫస్టాఫ్ షూటింగ్ అయిపోయింది. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇదే నిజం అంటున్నారు మేకర్స్.

డబుల్ స్పీడ్‌లో ఈ చిత్ర షూట్ జరుగుతుంది. జూన్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయనున్నారు డైరెక్టర్ వశిష్ట.

జులై నుంచి పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌తో బిజీ కానుంది విశ్వంభర. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా విడుదల కానుంది.

టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎప్పుడు ఏం చేసినా కూడా సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటుంది.

ఇప్పుడు కూడా ఇదే చేసారీయన. తన తర్వాతి దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

తనకు అదిరిపోయే హిట్ ఇచ్చిన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఉన్న ఫోటోలు షేర్ చేసారు విజయ్.

తమ ముగ్గురి ఫోటోకు “మై ఫేవరెట్ బాయ్స్” అంటూ క్యాప్షన్ పెట్టుకున్నారు ఈయన. ఏప్రిల్ 5న అయన నటించిన ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది.