లైలా అనౌన్స్‌మెంట్.. ప్రతినిధి 2 అప్డేట్..

TV9 Telugu

01 April 2024

విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ సినిమా ‘లైలా’ టైటిల్ రివీల్ చేసారు దర్శక నిర్మాతలు.

విశ్వక్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేశారు చిత్ర దర్శకనిర్మాతలు.

టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో చాలా బాగుందంటూ ప్రేక్షకుల నుంచి స్పందన వస్తుందనన్నారు లైలా మూవీ మేకర్స్.

ఈ సినిమాను రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో విశ్వక్ లేడీ గెట్ అప్ లో కనిపించనున్నట్లు సమాచారం.

సీనియర్ యాక్టర్ నారా రోహిత్ హీరోగా మూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్న పొలిటికల్ డ్రామా సినిమా ప్రతినిధి 2.

ప్రతినిధి 2 సినిమా టీజర్‌ను టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోకి మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో విడుదల చేసారు.

ఈ నేపథ్యంలో మూర్తి, నారా రోహిత్ ఇద్దరూ చిరంజీవి ఇంటికి వెళ్లగా.. వాళ్లను సాదరంగా ఆహ్వానించారు మెగాస్టార్.

ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.