TV9 Telugu
చెర్రీ మాట బూస్టప్ అన్న విశ్వక్.. RC16పై అనుకున్నదే నిజం అయింది..
21 Febraury 2024
తన కెరీర్‌లో పాన్ ఇండియా స్టార్ రామ్‌చరణ్ చెప్పిన మాట బూస్టప్ ఇచ్చిందని అన్నారు నటుడు విశ్వక్‌సేన్.
'నువ్వు ఎవరి మాటా వినాల్సిన పనిలేదు. రైట్ ట్రాక్‌లో ఉన్నావు. నీ మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ వెళ్లు'' అని తనతో చరణ్ చెప్పారని అన్నారు.
ఎదుటివారిని చూడగానే ఏదో ఒక మార్పును సూచించే ఈ ప్రపంచంలో, చరణ్ డిఫరెంట్‌గా ఆలోచించారని అనిపించిందని అన్నారు విశ్వక్‌సేన్.
రామ్‌చరణ్ హీరోగా ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో కథానాయకిగా జాన్వీ కపూర్ నటిస్తారంటూ ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా బోనీకపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్‌చరణ్‌తో జాన్వీ నటిస్తారనే విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు.
మహిళలను అత్యంత శక్తి మంతురాలిగా చూపించే ఏ కేరక్టర్‌నీ వదలుకోను అని అంటున్నారు సినీ నటి భూమి ఫడ్నేకర్.
ఆమె నటించిన లేటెస్ట్ సినిమా భక్షక్‌కి మంచి స్పందన వస్తోంది. ఆమె మాట్లాడుతూ జాతి నిర్మాణంలో పాలుపంచుకునే మహిళగా నటించడానికి తాను సిద్ధమని అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి