విశ్వక్ సేన్ ‘గామి’ అప్డేట్.. రకుల్ పెళ్లి కూతురాయనే..!

TV9 Telugu

30 January 2024

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తర్వాతి చిత్రం గామి ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేసారు మేకర్స్.

సినిమా ప్రకటించి చాలా రోజులు అయినప్పటికీ ఇప్పత్తివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు మూవీ టీం.

తాజాగా గామి ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. దర్శకుడు విద్యాధర్ ఈ గామి సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ లుక్ లో విశ్వక్ అఘోరాగా కనిపించి ఆకట్టుకున్నారు. దింతో ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా నటిస్తున్నారని తెలుస్తుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొంతకాలం ఏలిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలో ఆమె ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

రకుల్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది.

కొన్నేళ్లుగా జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నారు రకుల్. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది ఈ వయ్యారి.