బుల్లితెరపై లంకల రత్నాకర్‌.. గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి డేట్ ఫిక్స్.

Anil Kumar

11 June 2024

మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో స్పీడ్ లో దూసుకుపోతున్నాడు.

ఇటీవలే గామి విజయం అందుకున్న విశ్వక్.. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు.

ఇక మే 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ రాబట్టింది అనే చెప్పాలి.

ఈ సినిమాలో మరోసారి తనదైన నటనతో, డాన్స్ లతో ప్రసంశలు అందుకున్నాడు మాస్ హీరో విశ్వక్. మాస్ పెరఫార్మెన్ ఇచ్చాడు.

టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన "గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి" సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో ఈనెల ( జూన్) 14 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్టు తెలిపారు మూవీ మేకర్స్.

చరిత్రలో నిలిచిపోవడానికి లంకల రత్నం వస్తున్నాడు అంటూ అధికారకంగా ప్రకటించారు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం.

లంకల రత్నాకర్‌గా విశ్వక్‌సేన్‌, రత్నమాలగా అంజలి, బుజ్జి గా నేహాశెట్టి మెప్పించిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి.