జూనియర్ ఎన్టీఆర్ అట్టర్ ప్లాఫ్ సినిమాను రీమేక్ చేస్తానంటోన్న విశ్వక్ సేన్

TV9 Telugu

27 May 2024

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదారి సినిమాతో మళ్లీ మన ముందుక వస్తున్నాడు. నేహా శెట్టి కథానాయిక.

ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

దీంతో గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ తో బిజీగా బిజీగా ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

సినిమాల సంగతి పక్కన పెడితే నటుడు విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ ను అమితంగా ఆరాధిస్తారు. పలు సందర్భాల్లోనూ ఇది రుజువైంది.

తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్లలో పాల్గొన్న విశ్వక్ సేన్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమాని రీమేక్ చేయాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.

సాధారణంగా రీమేక్ సినిమా అంటే హిట్స్ నే ఎంచుకుంటారు. కానీ విశ్వక్ సేన్ మాత్రం ఏకంగా డిజాస్టర్ సినిమాను ఎంచుకున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన నా  అల్లుడు సినిమాను రీమేక్ చేసే ఆలోచన ఉందని చెప్పి అభిమానులను ఆశ్వర్య పరిచాడు విశ్వక్.

2005లో రిలీజైన ఈ సినిమాలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ అత్తగా నటించారు. జెనీలియా, శ్రియా శరన్ హీరోయిన్స్. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.