TV9 Telugu
విశ్వక్ సేన్ పేరు వెనక కథ.. జోజు జార్జ్ ఆంటోనీ తెలుగు వర్షన్..
21 Febraury 2024
విశ్వక్ సేన్ అంటే అందరికీ తెలుసు. కానీ ఈయన అసలు పేరు దినేష్ నాయుడు. అదే పేరుతోనే సినిమాల్లోకి వచ్చారు విశ్వక్.
కానీ ఆ పేరు అంతగా కలిసిరాకపోవడంతో న్యూమరాలజీ ప్రకారం విశ్వక్ సేన్ అని పేరు మార్చుకున్నట్లు తెలిపారీయన.
అలా మార్చేసాక ‘వెళ్ళిపోమాకే’ విడుదలవడం.. ‘ఫలక్‌నుమా దాస్’, ‘ఈ నగరానికి ఏమైంది’ వచ్చాయని తెలిపారు విశ్వక్.
సంఖ్యా శాస్త్రం, జ్యోతిషం, వాస్తు తాను నమ్ముతానని చెప్పట్లేదని.. కానీ నమ్మేవాళ్లని అగౌరవపరచను అంటున్నారు ఈ హీరో.
వైష్ణవ్ తేజ్ శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమాలో విలన్‌గా నటించిన జోజు జార్జ్ మలయాళంలో మంచి నటుడు.
ఆయన హీరోగా నటించిన మలయాళీ యాక్షన్ డ్రామా చిత్రం ఆంటోనీ సినిమా గతేడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్‌ను ఆహా వేదికగా ఓటీటీలో ఫిబ్రవరి 23న విడుదల చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.
జోషి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హలో సినిమా ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో కీలక పాత్రలో నటించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి