చీరలో పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న విష్ణుప్రియ..

20 November 2023

22 ఫిబ్రవరి 1990న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ విష్ణుప్రియ భీమినేని.

తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ చిత్ర పరిశ్రమలలో కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించింది ఈ బ్యూటీ.

2005లో మలయాళ డ్రామా రొమాన్స్ చిత్రం మయూఖంతో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది వయ్యారి భామ విష్ణుప్రియ.

2006లో తమిళ పొలిటికల్ యాక్షన్ మూవీ శివప్పతిగారం అనే చిత్రంతో కోలీవుడ్ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

2007లో రాజమౌళి దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్-కామెడీ చిత్రం యమదొంగతో టాలీవుడ్ సినీరంగ ప్రవేశం ఈ అందాల తార.

2008లో కన్నడ యాక్షన్ మూవీ గూలిలో అనే చిత్రంలో నటించి శాండల్ వుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ చిన్నది.

2017లో ETV ప్లస్‌లో ప్రసారమైన పోవే పోరా అనే యూత్ గేమ్ షోకి సుడిగాలి సుధీర్ తో కలిసి హోస్ట్‌గా చేసింది.

యూట్యూబ్‌లో అనేక కామెడీ షార్ట్ ఫిల్మ్‌స్, వీడియోల్లో నటించింది. ఇటీవల మానస్ తో కలిసి చేసిన ఓ మ్యూజిక్ వీడియో వైరల్ గా మారింది.