సినిమా చేయాలని ఉందని నేనే అడిగా: విశాల్..
TV9 Telugu
22 April 2024
కోలీవుడ్ హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం రత్నం.
‘భరణి’, ‘పూజ’ లాంటి హిట్స్ తర్వాత విశాల్-హరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఈ సినిమాని జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఇన్వెనియో ఆరిజిన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మేనన్, కోలీవుడ్ స్టార్ యోగిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు హరి గురించి మాట్లాడారు విశాల్.
హరితో సినిమా చేయాలని ఉందని తానే ఫోన్ చేసి అడిగినని, హరి సినిమాకి ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా ఉంటాయని తనకు తెలుసని చెప్పారు విశాల్.
రత్నం కథను హరి చెప్పిన తీరు ఇంకా కళ్ల ముందుందని అన్నారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ కాచుకుని ఉందని అన్నారు విశాల్.