ఇదేం ట్విస్ట్‌.. పెళ్లిపై షాకింగ్ విషయం చెప్పిన విశాల్

TV9 Telugu

22 May 2024

సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెళ్లి కాని ప్రసాదుల్లో కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకరు. ప్రస్తుతం అతని వయసు సుమారు 46 ఏళ్లు.

గతంలో వరలక్ష్మి శరత్ కుమార్, లక్ష్మీ మేనన్ తదితర హీరోయిన్లతో విశాల్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి.. కానీ ఏవీ పెళ్లి దాకా రాలేదు.

ఆ మధ్యన నటి అభినయను విశాల్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు గుప్పుమన్నాయి. కానీ వాటిని ఖండించాదు విశాల్.

దీంతో పెళ్లెప్పుడు అని విశాల్ అడిగితే షాకింగ్ రీజన్లు చెబుతున్నాడు. అదేంటంటే.. సల్మాన్ ఖాన్, ప్రభాస్, శింబు పెళ్లయ్యాక తన పెళ్లి అంటున్నాడు.

ఈ కామెంట్స్ విని విశాల్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. ప్రభాస్, శింబులకు ఈ ఏడాది  లేదో వచ్చే ఏడాదో పెళ్లిళ్లు జరిగిపోతాయి.

. కానీ విశాల్ ఏకంగా సల్మాన్ ఖాన్ పెళ్లిపీటలెక్కాకే  తాను పెళ్లి చేసుకుంటాననడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  

ఎందుకంటే సల్మాన్ కు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని బాలీవుడ్ లో ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది.

మరి సల్మాన్ తర్వాత పెళ్లి అంటున్నాడంటే విశాల్ కూడా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.