రత్నం నుంచి కొత్త పాట.. ఓదెల 2 గురించి సంపత్..

TV9 Telugu

11 March 2024

పందెంకోడి, పొగరు లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్. యాక్షన్ సినిమాలకు ఈయన పెట్టింది పేరు.

తాజాగా హరి దర్శకత్వంలో రత్నం సినిమాతో వస్తున్నారు విశాల్. తాజాగా ఈ సినిమా నుంచి డోన్ట్ వర్రీ మచ్చా అంటూ సాగే పాటను విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటుడు త్రిగుణ్.

ఈయన ప్రస్తుతం ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు. రఘుశాస్త్రి ఈ సినిమాకు దర్శకుడు.

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కలియుగం పట్టణంలో’.

తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ వలనే పెదవిపై..’ అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా మార్చి 22న థియేటర్స్‌లో విడుదల కానుంది.

సంపత్ నంది ఈ మధ్యే ఓదెల 2 సినిమాతో బిజీ అయ్యారు. తాజాగా ఈ సినిమా గురించి చెప్తూ.. టీమ్ మొత్తం ఎంతో కష్టపడుతోందని చెప్పారు.

ప్రధాన పాత్ర చేస్తున్న తమన్నా సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యారని తెలిపారు. ఈ సినిమా కథ, కథనాలు తప్పకుండా ఆకట్టుకుంటాయని తెలిపారు సంపత్.