06 December 2023

చెన్నైలో వరద.. ఒక్క వీడియోతో సెన్సేషన్ అయిన స్టార్ హీరో..

ఫిల్మ్స్‌లో హీరోయిజాన్ని అందరూ పండిస్తారు. కానీ రియల్‌ లైఫ్‌లో అదే హీరోయిజాన్ని కొందరే పండిస్తారు.

అలా పండించే ప్రజల మెప్పు పొందుతారు. శభాష్‌ అని వారి చేత అనిపించుకుంటారు.

ఇక తాజాగా విశాల్ కూడా అదే చేశారు. ప్రభుత్వ అధికారులను నిలదీస్తూ.. ఓ వీడియోను చేశారు

ఓ పక్క చెన్నై నగరం పై మిచౌంగ్ తుఫాను.. విరుచుకుపడుతున్న వేళ మేయర్‌.. కార్పోరేషన్ ఎంప్లాయిస్‌ ఏం చేస్తున్నారంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించారు

వరద నీరు ఎలాగూ మీ ఇళ్లల్లోకి రాదు.. కరెంటు పోదు.. ఫుడ్డుకు ఢోకా ఉండదు...

కానీ సాధారణ ఓటర్ల పరిస్థితి అలా లేదుగా అంటూ.. నేరుగా వారిపై సీరియస్ అయ్యారు.

తన వీడియోతో.. అందరూ తన వైపు చూసేలా చేసుకున్నారు ఈ స్టార్ హీరో.