TV9 Telugu

నా జీవితాన్ని మార్చింది విరాట్ కోహ్లీనే: వర్షా బోల్లమ్మ

14 Febraury 2024

క్రికెట్‌లో విరాట్ కోహ్లీ స్థాయి చాలా పెద్దది. ఈ ప్రభావం వల్ల మైదానంలో ఉన్న బౌలర్లు గానీ, మైదానం వెలుపల ఉన్న అభిమానులను ముంచేస్తుంది.

టీమిండియా తరపున ఆడినా.. ఐపీఎల్‌లో సందడి చేసినా.. అభిమానులు మాత్రం కోహ్లీ కోసమే వస్తుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

విరాట్ కోహ్లికి అలాంటి అభిమాని ఒకరున్నారు. ఈ అమ్మాయి కూడా సౌత్ ఇండియన్ సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. 

విరాట్ కోహ్లి వల్ల ఈ అమ్మాయి జీవితంలో భారీ మార్పులు వచ్చాయంట. ఆమెపేరే వర్షా బొల్లమ్మ. అసలు ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షా ప్రకారం, ఆమె క్రికెట్ చూడదు. కానీ, విరాట్ కోహ్లి కారణంగా ఇప్పుడు ఆమె ఈ ఆటను చూడటం ప్రారంభించింది.

తాను ఐపీఎల్ చూడటం ప్రారంభించానని, అది కూడా విరాట్ కోహ్లీ వల్లేనని సౌత్ హీరోయిన్ చెప్పుకొచ్చింది. కోహ్లీ అంటే క్రష్ అని తెలిపింది.

ఇది మాత్రమే కాదు, వర్షా బొల్లమ్మ RCBని తన అభిమాన IPL జట్టుగా కూడా పేర్కొంది. దీంతో వీలు కుదిరినప్పుడల్లా ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తానంటూ తెలిపింది.

వర్షకు క్రికెట్ అంటే కేవలం విరాట్ కోహ్లి మాత్రమేనని స్పష్టం అవుతోంది. ఈ గేమ్‌కు విరాట్ ఎంత ముఖ్యమో కూడా ఇది తెలియజేస్తోంది.