10 November 2023

ఇప్పుడిదే ట్రెండ్.! ఇవే కలెక్షన్స్ కురిపిస్తున్నాయి.. విలేజ్ హార్రర్.

అనగనగా ఓ ఊరు.. ఊళ్లో దెయ్యం.. చేతబడులు, క్షుద్ర పూజలు.. టాలీవుడ్‌లో ఇప్పుడిదే సక్సెస్ ఫార్ములా.

అలాంటి జోనర్‌ ఉంటే వెంటనే ఓకే అంటున్నారు హీరోలు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు బాగా కాసులు కురిపించిన జోనర్ ఇది.

తాజాగా మరో సినిమా కూడా ఇదే దారిలో వస్తుంది. మరి అది కూడా మాయ చేస్తుందా..? అసలేంటి ఆ సినిమా..?

హార్రర్ విత్ కామెడీ.. అప్పట్లో సెన్సేషనల్ కాంబినేషన్ ఇది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.

హార్రర్ విత్ సస్పెన్స్ వైపు వెళ్తున్నారు మన దర్శకులు. అందులోనూ ఊళ్లో జరిగే కథల వైపు అడుగులేస్తున్నారు.

తాజాగా పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మంగళవారం కూడా ఇదే జోనరే. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాది ఇదే నేపథ్యం. సాయి ధరమ్ తేజ్‌కు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇచ్చింది విరూపాక్ష.

అలాగే మా ఊరి పొలిమేర 2 కూడా సంచలనం రేపుతుంది. ఆ మధ్య మసూధ కూడా ఇలాంటి కథతోనే వచ్చింది.

పూర్తిగా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన మసూధ మంచి విజయం సాధించింది. ఈ విజయాలు చూసాక.. చాలా మంది దర్శకుల కన్ను హార్రర్ డ్రామాస్ వైపు వెళ్తుంది.