గోట్‌ డేట్‌ ఫిక్సయింది.. 

TV9 Telugu

13 April 2024

కోలీవుడ్ స్టార్ విజయ్‌ దళపతి హీరోగా నటిస్తున్న సినిమా గోట్‌. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌.

ప్రముఖ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన మీనాక్షి చౌదరి ఇందులో కథానాయకిగా నటిస్తుంది.

AGS ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు అందిస్తున్నారు.

నటులు ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్ ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సీనియర్ హీరోయిన్లు స్నేహ, లైలా కూడా ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పార్వతి నాయర్ ఓ పాత్రలో కనిపించనున్నారు.

స్టార్ కమెడియన్ యోగి బాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్ తిదితరులు గోట్‌ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాను సెప్టెంబర్‌ 5న వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్.