విజయ్ పొలిటికల్ ఎంట్రీ..  చిరుకి సారీ చెప్పిన రైటర్..

TV9 Telugu

04 February  2024

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా రోజుల నుంచి విజయ్ రాజకీయ అరంగేట్రం గురించి చర్చ నడుస్తుంది.

తాజాగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. అంతేకాదు పార్టీ పేరును కూడా అనౌన్స్ చేసారు.

తమిళగ వెట్రి కళగం అనే పేరుతో వచ్చారీయన. పార్టీ ఎజెండా త్వరలో ప్రకటిస్తానంటూ వెల్లడించారు విజయ్ దళపతి.

తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న అవినీతి పాలన అంతమొందిచడమే తన ధ్యేయం అంటున్నారు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి.

చిరంజీవికి క్షమాపణలు చెప్పారు రైటర్ చిన్నికృష్ణ. ఆయనకు పద్మ విభూషణ్‌ వచ్చిన సందర్భంగా ఇంటికి వెళ్లి సన్మానించారు ఈయన.

గతంలో కొంతమంది ప్రోద్భలంతో చిరంజీవిపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసానని.. దానికిప్పుడు సారీ చెప్పానని చెప్పుకొచ్చారు.

టైమ్‌ బాగాలేనప్పుడు తెలియకుండానే తప్పులు చేస్తారని.. తను కూడా అదే తప్పు చేశానని తెలిపారు చిన్నికృష్ణ.

పద్మ విభూషణ్‌ వచ్చిన సందర్భంగా ఇటీవల చాలామంది చాల మంది సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.