TV9 Telugu
16 February 2024
ఏంటి బాస్.! 200 కోట్ల రెమ్యూనిరేషన్ ఆ.! విజయ్ రేంజ్ అంతే.
ఒక్కో సినిమాకు అక్షరాల 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్న హీరోలే మన ఇండియన్ సినిమాలో చాలా తక్కువగా ఉన్నారు.
అలాంటిది ఇప్పుడు ఏకంగా 200 కోట్లు కావాలంటున్నారు ఓ హీరో.. దానికి నిర్మాతలు కూడా సై అనేసారు. ఆయన ఎవరు అనుకుంటున్నారా.?
ఆయనే విజయ్ దళపతి. ఈ హీరో చివరి సినిమా కోసం ఏకంగా 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
2026 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా పాలిటిక్స్‌లో అడుగు పెట్టిన విజయ్ ఇంకా ఒక్క సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు.
అందుకే విజయ్ లాస్ట్ మూవీకి డిమాండ్ గట్టిగానే ఉంది. DVV దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దీనికోసం దర్శకుల వేట జరుగుతునే ఉంది.
ఈ సినిమా కోసం విజయ్‌కు 200 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సై అంటున్నారు.
దళపతి విజయ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాల్లో లియో సినిమా పర్లేదు అనిపించుకుంది.
ఎందుకంటే విజయ్ గత సినిమాలన్నీ టాక్‌తో సంబంధం లేకుండా 300 కోట్ల వరకు వసూలు చేసాయి.. లియో అయితే 500 కోట్లు క్రాస్ అయింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి