20 February 2024

తన పొలిటికల్ పార్టీ పేరు మార్చిన విజయ్ ఎందుకంటే ??

TV9 Telugu

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చారు.  ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు విజయ్.

ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజాసేవకే అంకితం కాబోతున్నట్లు వెల్లడించారు.

ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే ప్రకటించారు. పార్టీ ప్రకటన తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్న విజయ్‌.. ప్రస్తుతం పొలిటికల్‌గా స్పీడ్‌ పెంచుతున్నారు.

దానిలో భాగంగా.. తాజాగా పార్టీ తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంతో.. తమిళ్ పొలిటికల్ ఫీల్డ్‌లో హాట్ టాపిక్ కూడా అయ్యారు.

ఇక విజయ్‌ పెట్టిన ఈ మీటింగ్ ముచ్చట్లతో పాటు.. మరో న్యూస్ కూడా తమిళ్ మీడియాలో సర్కులేట్ అవుతోంది అదే.. విజయ్‌ తన పార్టీ నేమ్‌.

తమిళగ వెట్రి కళగం లో స్వల్ప మార్పులు చేయబోతున్నారనేది. ఎస్ ! తన పార్టీ పేరులో అదనంగా ‘క్‌’ అనే అక్షరాన్ని చేర్చబోతున్నట్లు టాక్‌ నడుస్తోంది.

ప్రస్తుతం విజయ్‌ పార్టీని TVK అని పిలుస్తుండగా అదే పేరుతో తమిళనాడులో ఉన్న కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

దాంతో.. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం పేరులో ‘క్‌’ అనే అక్షరాన్ని కలపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.