తల్లి కోసం విజయ్ ఏంచేశారంటే.?
TV9 Telugu
14 April 2024
తెలుగు, తమిళంలో నటుడిగా స్టార్ స్టేటస్ అందుకున్న తెచ్చుకున్న కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో విజయ్ దళపతి.
తన నటనకి కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు విజయ్.
ఇటీవల తమిళగ వెట్రి కళగం అనే ఓ పొలిటికల్ పార్టీ కూడా పెట్టారు విజయ్ దళపతి. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనున్నారు.
ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ చిత్రం ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు హీరో విజయ్.
తాజాగా విజయ్ తన తల్లి శోభ చంద్రశేఖర్ గురించి చేసిన ఓ గొప్ప పని బయటపడింది. దీన్ని తన తల్లి స్వయంగా చెప్పారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తన తల్లి శోభ చంద్రశేఖర్ కోరిక మేరకు చెన్నై సిటీలో ఓ గుడి కట్టించారు.
చెన్నై నగరంలో విజయ్ కట్టించిన సాయిబాబా గుడికి తాను ప్రతి గురువారం తప్పకుండ వెళ్తానని అన్నారు తన తల్లి శోభ.
హీరో విజయ్ కూడా పలు సందర్భాల్లో అక్కడికి వెళ్లి పూజలు చేస్తుంటారని చెప్పారు ఆయన తల్లి శోభ చంద్రశేఖర్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి