విజయ్‌తో వెట్రి మారన్.. ఆపరేషన్ వాలంటైన్ అప్డేట్..

TV9 Telugu

07 February  2024

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి లియో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తమిళంలో వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.

గతేడాది తెలుగులో వారసుడు, పాన్ ఇండియా మూవీ లియోతో వచ్చిన విజయ్.. 2024లోనూ రెండు సినిమాలతో రావాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం సినిమా సమ్మర్ తర్వాత విడుదల కానుంది.

ఇక డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌లో విజయ్ కమిట్ అయిన సినిమాను వెట్రి మారన్ తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న సినిమా ఆపరేషన్ వాలంటైన్.

ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పని చేస్తున్న వింగ్ కమాండర్‌గా కనిపిస్తున్నారు.

శత్రుదేశాల మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసే సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఆపరేషన్ వాలంటైన్ సినిమా తెరకెక్కుతుంది.

ఆపరేషన్ వాలంటైన్ సినిమా నుంచి తాజాగా గగనాలా అంటూ సాగే ఓ లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.