తెలుగు ఇండస్ట్రీ వైపు విజయ్ అడుగులు.. పద్మ విభూషణుడితో పద్మ శ్రీలు..

TV9 Telugu

01 February  2024

తమిళం సినిమాతో పాటు తెలుగు ఇండస్ట్రీపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.

గతేడాది దిల్ రాజు నిర్మాణంలో వారసుడు సినిమా చేసిన ఈయన.. ఇప్పుడు మరో అగ్ర నిర్మాణ సంస్థకు సినిమా కమిటయ్యారు.

ట్రిపుల్ ఆర్ ఫేమ్ డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌లో విజయ్ తర్వాతి సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అంతా ఒకే అయితే మరోసారి విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమాతో సందడి చేస్తారు. అయితే ఇది ఎప్పుడు వస్తుందో క్లారిటీ రావాలి.

దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ రావడంతో రెండు మూడు రోజులుగా చిరంజీవి ఇంటికి ప్రముఖులు వస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇంటికి ఈ ఏడాది పద్మ శ్రీ గ్రహీతలను పిలిపించుకుని సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి.

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన యక్షగాన కళాకరుడు గడ్డం సమయ్య, స్థపతి డాక్టర్ ఆనందచారి వేలును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు చిరు.

ఇదిలా ఉంటె ప్రస్తుతం చిరంజీవి బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో సోసియోఫాంటాసి విశ్వంభరలో హీరోగా నటిస్తున్నారు.