విజయ్ సేతుపతి ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వారు ఎవరో తెలుసా ??
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒకరు.
ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు విజయ్ సేతుపతి పరిచయమయ్యారు.
ఈయన పలు సినిమాలలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే ఈయన సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు.
కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే తెలియజేస్తుంటారు. అయినప్పటికీ ఈయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈయనకు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 7.3మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఈయన మాత్రం కేవలం 7 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్, తమిళ్ డైరెక్టర్ మిస్కిన్, హీరోయిన్ అంజలి, కోలీవుడ్ నటుడు రమేష్ తిలక్,
కోలీవుడ్ గేయ రచయిత కార్తీక్ నేత, డైరెక్టర్ రంజిత్ జయకోడి, తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ ను మాత్రమే ఈయన ఫాలో అవుతున్నారు