అందుకే తెలుగు సినిమాల్లో నటించట్లేదు: విజయ్ సేతుపతి

TV9 Telugu

19 June 2024

మక్క‌ల్ సెల్వ‌న్ విజయ్ సేతుపతి.. గత వారం పది రోజులుగా ఈ పేరు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సేతుపతి నటించిన మహారాజా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది.

జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ డ్రామా తెలుగులోనూ ఊహించని కలెక్షన్లను సాధిస్తుండడం విశేషం.

దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసింది మహరాజా టీమ్. వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

హీరో విజయ్ సేతుపతి కూడా ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.  రోజుకో అంశంతో నెట్టింట వైరల్ అవుతున్నారు.

తాజాగా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతపతి తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదో అసలు కారణం చెప్పేశారు.

తెలుగులో తన దగ్గరకు వస్తోన్న కథలు చాలా అద్భుతంగా ఉన్నాయన్న సేతుపతి  వారు ఆఫర్‌ చేసిన పాత్రలు మాత్రం నచ్చడం లేదన్నారు.

ఆఫర్‌ చేసిన పాత్రకు తాను సెట్‌ కానని భావించడం వంటి కారణాలతో తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు మక్కల్ సెల్వన్