TV9 Telugu
ఏంటి నన్నే అడుగుతున్నారా.? అని రీచెక్ చేసుకున్న విజయ్ సేతుపతి.
10 January 2024
మక్కళ్ సెల్వన్ లేటెస్ట్ ఇంటర్వ్యూల్లో ఏం చెబుతారా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
భాషా సరిహద్దులు దాటి ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న పెర్ఫార్మెన్స్ విజయ్ సేతుపతి సొంతం.
హీరో, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్.. కేరక్టర్ ఏదైనా, సిల్వర్ స్క్రీన్ మీద రఫ్ఫాడించేస్తారు.
ముంబైకార్, గాంధీ టాక్స్ ఆఫర్లు వచ్చినప్పుడు, ఇవే ఆఖరు అని అనుకున్నారట విజయ్ సేతుపతి.
తనకు హిందీ సరిగా రాకపోవడంతో, అంతకు మించి అవకాశాలు తలుపు తట్టవని ఫిక్సయిపోయారట.
కానీ జవాన్ అవకాశం వచ్చినప్పుడు ఆశ్చర్యపోయానని అంటున్నారు మిస్టర్ సేతుపతి.
జవాన్ సినిమాలో షారుఖ్‌కి విలన్‌గా నటించమని అడిగినప్పుడు, ఏంటి నన్నే అడుగుతున్నారా.? అని రీచెక్ చేసుకున్నారు.
అలాగే ఫర్జి ఆఫర్ వచ్చినప్పుడు కూడా నమ్మలేకపోయా. ఎందుకంటే, నా హిందీ స్కిల్స్ ఏంటో నాకు తెలుసు.
అయినా ప్రేక్షకులు, ఫిల్మ్ మేకర్స్ నా మీద చూపించిన అభిమానానికి ఫిదా అయిపోయా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి