విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు విలక్షణ నటనతో తెలుగు తమిళ ప్రజలను ఇట్టే ఆకట్టుకున్నారు.
అయితే తాజాగా విజయ్ సేతుపతి తాజాగా హైదరాబాద్ లో మహారాజా సినిమా ప్రమోషన్స్ లో సందడి చేసి మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విజయ్ సేతుపతి పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ అనేక మంది సినిమా ప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తారు.
అయితే లేటుగా అయినా లేటెస్ట్ గా స్పందించిన విజయ్ సేతుపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ కష్టపడే తత్వాన్ని చాలా గౌరవిస్తానని, ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చిన ఆయన తొడ కొట్టినప్పుడు రియల్ లైఫ్ లో ఎంత మాస్ నో అర్థమైంది అంటూ పేర్కొన్నారు.
ఎవరి కథలోనో ఆయన హీరో కాదని, ఆయన సొంత కథలో ఆయనే హీరో అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.