లియో సినిమా నుంచి పాట విడుదల.. గేమ్ చెంజర్ నయా  అప్డేట్..

14 October 2023

విజయ్, లోకేష్ కానకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లియో సినిమాలోని నే రెడీ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.

తమిళంలో ఎప్పుడో వచ్చిన ఈ  పాట తెలుగు వర్షన్ మాత్రం ఇప్పుడు విడుదల చేసారు లియో సినిమా దర్శక నిర్మాతలు.

తెలుగు ఇండస్ట్రీకి దసరా కాస్త ముందుగానే వచ్చేస్తుంది. అక్టోబర్ 15 నుంచి 4 రోజుల పాటు రోజుకో టీజర్ విడుదల కానుంది.

15న నాని హాయ్ నాన్న.. 16న వెంకటేష్ సైంధవ్.. 17న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. 18న విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమాకు సంబంధించిన టీజర్స్ విడుదల కానున్నాయి.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్,శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోలుగా నందకిషోర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా వృషభ.

ఈ సినిమా రెండో షెడ్యూల్ ముంబైలో మొదలైంది. అక్టోబర్, నవంబర్ అంతా అక్కడే షూట్ చేయనున్నారు. దసరాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు మేకర్స్.

ఇంకా సమయం పడుతుందేమో అనుకొంటున్న రామ్ చరణ్ గేమ్ చెంజర్ చిత్రం షూటింగ్ తాజాగా మొదలుపెట్టారు దర్శకుడు శంకర్.

తాజాగా ప్రారంభమైన షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రకరించనున్నారు. దీంతో ఇండియన్ 2 డబ్బింగ్ కూడా పూర్తిచేస్తున్నారు శంకర్.